*'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కొత్త సినిమా.. తమిళ హీరో శివకార్తికేయన్‌తో ఉంటుందని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ విషయమై సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు.
తొలిసారి రాత్రంతా నవ్వుతూనే ఉన్నానని.. అనుదీప్, శివకార్తికేయన్, నవీన్ పోలిశెట్టితో ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Maanadu telugu remake: శింబు 'మానాడు' సినిమా రీమేక్‌తో పాటు తెలుగు డబ్బింగ్ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయమై ఫొటో పోస్ట్ చేసింది.
మానాడు సినిమా.. సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటన
టైమ్ లూప్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శింబు, ఎస్జే సూర్య.. తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.
Srikanth bolla biopic: ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ జీవితం ఆధారంగా హిందీ సినిమా తీస్తున్నారు. మచిలీపట్నంకు చెందిన ఈయన అంధుడు. అయితే ఇది తనకు అడ్డంకి కాదని నిరూపించిన శ్రీకాంత్.. మసాచుసెట్స్ యూనివర్సిటీలో బిజినెస్ డిగ్రీ పొందారు. బొల్ల ఇండస్ట్రీస్ పేరుతో పరిశ్రమల్ని స్థాపించి గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రీకాంత్ బొల్లాతో మూవీ టీమ్
ఈ సినిమాలోని టైటిల్ రోల్లో రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నారు. తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై నుంచి షూటింగ్ మొదలు కానుంది.
*కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమాను జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ విషయాన్ని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. శుక్రవారం ఉదయం 10:19 గంటలకు టైటిల్ పోస్టర్ విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ సినిమా శుక్రవారమే లాంఛనంగా ప్రారంభించనున్నారని, టవినరో భాగ్యం విష్ణు కథ' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని సమాచారం.
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా
ఇవీ చదవండి: