మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలుఇటీవలహోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్ అధ్యక్షతన పోటీ చేసిన కార్యవర్గం గెలుపొందింది. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ శివాజీరాజాకు చెందిన వర్గం దీనికి అడ్డుపడుతోందని నూతన అధ్యక్షుడు నరేశ్ ఆరోపించారు.
ప్రమాణ స్వీకారంపై 'మా'లో రగడ - ప్రమాణ స్వీకారంపై 'మా'లో రగడ
టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నరేశ్ అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి మాజీ వర్గం నుంచి బెదిరింపులు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
"‘మా’లో అంతర్గతంగా చాలా వ్యవహారాలు నడిచాయి. అవన్నీ మర్చిపోయి అందరినీ కలుపుకొని పనిచేయాలని నిర్ణయించుకున్నాను. కానీ కొందరు మమ్మల్ని పనిచేసుకోనీయకుండా వెనక్కి లాగుతున్నారు" అంటూ నరేశ్ వ్యాఖ్యానించారు.
'చిత్ర పరిశ్రమలోని పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలో వేడుక చేసుకునేందుకు ఈ నెల 22వ తేదీన ముహూర్తం ఖరారు చేసుకున్నాం. కానీ నా పదవీకాలం అయ్యేవరకు ఎవరూ మా కుర్చీలో కూర్చోవద్దు అంటూ శివాజీ రాజా చెప్తున్నారు. ఇది సమంజసం కాదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని నూతన వర్గం వెల్లడించింది.