మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA Elections) నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ స్పందించారు. హేమ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా దృష్ట్యా 'మా' ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.
MAA Elections: 'హేమపై చర్యలు తీసుకుంటాం'
'మా' ఎన్నికలపై హేమ చేసిన ఆరోపణలు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీశాయని 'మా' అధ్యక్షుడు నరేష్ అన్నారు. ఎన్నికలు జరగకుండా తాను ప్రయత్నిస్తున్నాననే హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. హేమపై క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేస్తామని నరేష్ చెప్పారు.
'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్రకటించడం వల్ల ఒక్కసారిగా అందరి చూపు సిని'మా' పరిశ్రమపై పడింది. 'మా'కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానెల్‌ను ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి:MAA elections: నరేశ్‌పై హేమ సంచలన ఆరోపణలు