తెలుగు నటీనటుల సంఘంలో నెలకొన్న వివాదాలపై ఆ సంస్థ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... 'మా' అంతర్గత విభేదాలపై స్పష్టత ఇచ్చారు.
" మా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే నేను ఒకసారి మాత్రమే పదవి చేపడతానని చెప్పాను. ఇదేమీ రాజకీయ పార్టీ కాదు. సేవా సంస్థగా భావించాలి. చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి పెద్దల సహకారంతో అందర్నీ కలుపుకొని వెళ్తున్నాను. నేను వచ్చిన ఆరు నెలల్లోనే వీలైనంత చేశా. షూటింగ్ల బిజీ వల్ల అనుకున్నది చేయలేకపోతున్నా. 'మా'లో ఆదిపత్యపోరు, వివాదాలు ఉన్న మాట వాస్తవమే. నేను పదవి చేపట్టి సంవత్సరం పూర్తైంది. మరో సంవత్సరం మాత్రమే ఉంది"