దేశాన్ని, ధర్మాన్ని వ్యతిరేకించిన ప్రకాశ్ రాజ్‌కు(maa elections prakashraj panel) మా అసోసియేషన్ అధ్యక్షుడయ్యే అర్హత లేదని సినీ నటుడు, భాజపా సినిమా సెల్ కన్వీనర్ సీవీఎల్.నరసింహారావు(cvl narasimha rao maa election) స్పష్టం చేశారు. వైరస్ లాంటి ప్రకాశ్ రాజ్‌ను ఓడించి తెలంగాణ బిడ్డలను గెలిపించాలని పిలుపునిచ్చారు.
maa elections 2021: 'ప్రకాశ్‌రాజ్‌ను ఓడించి వారిని కాపాడాలి' - మా ఎలక్షన్స్ 2021
ప్రకాశ్‌రాజ్‌కు(maa elections prakashraj panel) 'మా' అసోసియేషన్ అధ్యక్షుడయ్యే అర్హత లేదు అని సినీ నటుడు సీవీఎల్.నరసింహారావు అన్నారు(cvl narasimha rao maa election). ప్రకాశ్‌రాజ్ ఓ వైరస్ అని, ఆయన్ను ఓడించి తెలంగాణ బిడ్డలను గెలిపించాలని కోరారు.

హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, గీతామూర్తితో కలిసి మా తెలంగాణ ప్యానెల్ పోస్టర్‌ను సీవీఎల్ నరసింహారావు ఆవిష్కరించారు. తెలంగాణ బిడ్డలను గెలిపించేందుకు 'మా' తెలంగాణ ప్యానెల్ (maa elections 2021) పనిచేస్తోందని తెలిపారు. ప్రకాశ్ రాజ్‌ను(maa elections prakashraj) ఓడించేందుకు భాజపా రంగంలోకి దిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జాతీయ పార్టీకి ప్రకాశ్ రాజ్‌ను ఓడించాల్సిన అవసరమేముందన్నారు. జై తెలంగాణ అన్న నటుల జీవితాలు నాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: MAA Elections 2021: 'మా'లో తారస్థాయికి మాటల యుద్ధం