తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ వ్యాఖ్యలపై దుమారం.. 10 తర్వాత ఏం జరగనుంది? - మా ఎలక్షన్స్​ ప్రకాశ్ రాజ్​ ప్యానల్​

'రిపబ్లిక్' ప్రీరిలీజ్(Republic pre release event) ఈవెంట్​లో ​పవన్​కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చిత్రసీమ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. 'మా' ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్(pawankalyan vs mohanbabu) ​ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన మాటలను పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా 'మా' ఎన్నికల బరిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న మోహన్​బాబు, బండ్ల గణేశ్​, ప్రకాశ్​రాజ్ అక్టోబర్​ 10 తర్వాత దీనిపై స్పందిస్తామని చెప్పారు. దీంతో అక్టోబరు 10 తర్వాత వాళ్లు ఏం మాట్లాడబోతున్నారు, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

maa elections
మా ఎన్నికలు

By

Published : Sep 27, 2021, 10:05 PM IST

తెలుగు ప్రజల దృష్టంతా అక్టోబర్​ 10న జరగబోయే 'మా' ఎన్నికల(maa elections 2021) పైనే ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా చిత్రసీమ రెండు వర్గాలుగా విడిపోయి.. అభ్యర్థుల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ఉత్కంఠగా ఈ సారి ఎలక్షన్స్​ జరగనున్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ తేదీతో పాటు ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే విషయం ఆసక్తిగా మారింది. ఎందుకంటే హీరో సాయి ధరమ్ తేజ్​ నటించిన 'రిపబ్లిక్'(Republic pre release event) ప్రీరిలీజ్​​ ఈవెంట్​లో హీరో ​పవన్​కల్యాణ్(pawankalyan vs mohanbabu) ​చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఈ మాటలతో 'మా' ఎలక్షన్స్​కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ఎన్నికల ​ బరిలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉన్న సీనియర్​ నటులు మోహన్​బాబు, ప్రకాశ్​రాజ్​, నిర్మాత బండ్ల గణేశ్ అక్టోబరు 10న మాట్లాడతామని చెప్పారు. మరి వీరిలో ఎవరు గెలుస్తారు? ఏం మాట్లాడతారు? పవన్​కు ఎవరు మద్దతు పలుకుతారు? ఎవరు కౌంటర్లు వేస్తారు? అనే విషయంపై ప్రజల్లో ఆసక్తిగా నెలకొంది.

పవన్​ వ్యాఖ్యలను ఇప్పటికే తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు ప్రకాశ్​రాజ్(Maa elections prakash raj panel)​. కానీ దీనిపై ప్రస్తుతం పూర్తిగా మాట్లాడలేనని, ఎన్నికల తర్వాతే నోరు విప్పుతానని చెప్పారు. ఇక బండ్ల గణేశ్​ విషయాన్నికొస్తే తానెప్పుడూ పవన్​ అభిమానిననే అంటుంటారు. మరి ఈయన ఏమి మాట్లాడుతారో చూడాలి. ముఖ్యంగా మోహన్​బాబు(pawankalyan mohanbabu) ఏం మాట్లాడనున్నారా అని ఉత్సుకతో ఉన్నారంతా. ఎందుకంటే పవన్​ వ్యాఖ్యలకు ఆయనొక్కరే సెటైరికల్​గా స్పందించారు.
పవన్​ ఏమన్నారంటే?
సెప్టెంబరు 25న సాయిధరమ్​ తేజ్(sai dharam tej republic movie) హీరోగా నటించిన 'రిపబ్లిక్'(republic movie pre release event) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పవన్​ హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిత్రపరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రసీమ జోలికి వస్తే ఊరుకునేదే లేదని అన్నారు. అందులో భాగంగానే సినిమావాళ్ల కష్టాలపై మోహన్‌బాబు(pawankalyan mohanbabu fight) మాట్లాడాలని డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమ గురించి వైకాపా నేతలకు చెప్పాలని సూచించారు.
భిన్న స్పందన..
పవన్​ చేసిన ఈ వ్యాఖ్యలకు యువహీరో నాని, కార్తికేయ సహా పలువురు మద్దతు పలకగా.. మరికొందరూ విమర్శించారు. ఈ క్రమంలోనే స్పందించిన మోహన్​బాబు.. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోటీలో ఉన్న తన కుమారుడు నటుడు మంచు విష్ణుకు(Maa elections manchu vishnu panel) ఓటు వేయాలని పవన్​కు సూచించారు. అక్టోబర్​ 10తర్వాత దీనిపై సమాధానమిస్తానని చెప్పారు. ఇక ప్రకాశ్​రాజ్​, బండ్లగణేశ్​ కూడా తర్వాత జవాబిస్తామని అన్నారు.


ఇదీ చూడండి: ఇప్పుడు వారే నాకు తోడు: సమంత

ABOUT THE AUTHOR

...view details