తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని పలువురు సభ్యులు క్రమశిక్షణ కమిటీని డిమాండ్ చేశారు. 'మా' అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు.
MAA elections: 'వారిపై చర్యలు తీసుకోవాలి' - మా ఎలక్షన్స్
'మా' అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు పలువురు సభ్యులు. అలాగే ఈ ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయనను కోరారు.
మా ఎలక్షన్స్
ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై కొంతమంది సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం సబబుగా లేదన్న మానిక్.. మా అసోసియేషన్‌ను చులకనగా చేసి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజును కోరారు. 110 మంది సభ్యుల మద్దతు విష్ణుకు ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: MAA Elections 2021: నటి హేమకు షోకాజ్ నోటీసులు