తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మా ఎన్నికల్లో రఘుబాబు, శివ బాలాజీ విజయం - maa elections live

ఎంతో ఆసక్తిగా జరిగిన మా ఎలక్షన్​లో విష్ణు ప్యానల్​కు చెందిన రఘబాబు, శివబాలాజీ విజయం సాధించారు.

.
.

By

Published : Oct 10, 2021, 8:52 PM IST

Updated : Oct 10, 2021, 9:50 PM IST

'మా' ఎన్నికల ప్రచారం ఎంత హోరా హోరీగా సాగిందో.. ఓట్ల లెక్కింపు కూడా అదే ఉత్కంఠతో కొనసాగుతోంది. మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. జనరల్‌ సెక్రటరీ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత రాజశేఖర్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

కోశాధికారిగా శివబాలాజీ

'మా' కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు పోలయ్యాయి.

.

కార్యవర్గ సభ్యులు వీరే..

మంచు విష్ణు ప్యానెల్‌లో మాణిక్, హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. మోహన్‌బాబు, మురళీ మోహన్‌, నరేశ్‌ తదితరులు కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.

.
Last Updated : Oct 10, 2021, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details