తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' ఎన్నికల కౌంటింగ్ షురూ - ప్రకాశ్​రాజ్ ప్యానెల్

'మా' కొత్త అధ్యక్షుడు ఎవరో మరికొద్ది గంటల్లే తెలిసిపోతుంది. ఉదయం జరిగిన పోలింగ్​ ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు.

MAA elections 2021 vote counting start
ప్రకాశ్​రాజ్-మంచు విష్ణు

By

Published : Oct 10, 2021, 4:27 PM IST

మా ఎన్నికల(maa elections 2021) ఓట్ల లెక్కింపు.. చెప్పిన సమయం కంటే ముందు ప్రారంభమైంది. ఈసారి 'మా' చరిత్రలో ఎన్నడూ లేనంత ఓటింగ్ జరగడం వల్లే అరగంట ముందు లెక్కింపు మొదలైంది.

సిబ్బంది.. కార్యవర్గ సభ్యులకు పోలైన ఓట్లను వేరు చేస్తున్నారు. ముందు 'మా' ఈసీ సభ్యులు.. పోస్టల్ బ్యాలెట్​ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థుల ఓట్ల లెక్కించనున్నారు. లెక్కింపు వేదిక దగ్గరకు కేవలం ప్యానెల్ సభ్యుల్ని మాత్రమే అనుమతిస్తారు.

అయితే ఈసారి పలువురు టాలీవుడ్​ ప్రముఖులు ఓటు వేయలేకపోయారు. ఈ జాబితాలో మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌, రానా, రకుల్‌, త్రిష, అనుష్క, ఇలియానా, హన్సిక తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details