మంచు విష్ణు ప్యానెల్‌పై(manchu elections manchu vishnu) 'మా' ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్, జీవితా రాజశేఖర్‌తో(maa elections prakash raj) కలిసి ఈ కంప్లెయింట్ చేశారు. 'మా' ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు లేఖ అందించారు. పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు(maa elections manchu vishnu panel) కుట్ర చేస్తున్నారని అన్నారు. 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
"'మా'లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తుంది. నిన్న సాయంత్రం ఒక వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ డబ్బు కట్టారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేయాలంటే వ్యక్తిగతంగా 'మా'కు లేఖ రాసి డబ్బు కట్టాలి. ఆగంతకులతో 'మా' ఎన్నికలను నిర్వహిస్తారా? కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి వాళ్ల పోస్టల్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి."