తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA Elections 2021: 'చిత్రసీమకు ఎప్పటికీ చిరంజీవే పెద్ద దిక్కు' - movie artists association elections

ఇన్నాళ్లూ 'మా' అసోసియేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసిన పెద్దలను ప్రశ్నించేందుకే ఎన్నికల్లో(MAA Elections 2021) పోటీ చేస్తున్నట్లు చెప్పారు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj). కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది సినీ కార్మికులను మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారని.. మంచు కుటుంబం ఎంతమందికి సహాయం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా ప్రకాశ్​ రాజ్​ ప్రశ్నించారు.

Prakash Raj
ప్రకాశ్ రాజ్

By

Published : Oct 4, 2021, 7:42 PM IST

సినీ పరిశ్రమకు ఇప్పటికీ.. ఎప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవే (Megastar Chiranjeevi) పెద్దదిక్కని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ కార్మికులను ఆదుకున్న వ్యక్తిగా చిరు నిలిచారని కొనియాడిన ప్రకాశ్ రాజ్.. మంచు కుటుంబం ఎంత మందికి సహాయం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

'మా' ఎన్నికలపై ప్రకాశ్ రాజ్​ ఇంటర్వ్యూ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో (MAA Elections 2021) అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.. అధ్యక్ష పదవిపై మోహన్ బాబు, మంచు విష్ణు (Manchu Vishnu), నరేశ్​ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వారుసులే 'మా' ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ ఉండాలా? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. మా సభ్యులకు మంచి చేయడం సహా ఇన్నాళ్లూ మా అసోసియేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసిన పెద్దలను ప్రశ్నించేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. అక్టోబర్ 10న 'మా' ఎన్నికల్లో (MAA Elections 2021 Date) అధ్యక్షుడిగా గెలిచి మొదటి ఫోన్ మంచు విష్ణుకే చేస్తానంటోన్న ప్రకాశ్ రాజ్​తో 'ఈటీవీ భారత్​' ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖీ.

ముఖాముఖిలో ప్రకాశ్ రాజ్

ఇదీ చూడండి:MAA Elections: రెబల్​స్టార్​ను కలిసిన మంచు విష్ణు

ABOUT THE AUTHOR

...view details