తెలుగు ప్రజల్లో ఆసక్తి రేపిన 'మా' ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. నువ్వానేనా అన్నట్లు తలపడిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై అధ్యుక్షుడిగా మంచువిష్ణు గెలుపొందారు. ఈ సందర్భంగా పలువురు విష్ణుకు అభినందనలు తెలపగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా విష్ణుకు కంగ్రాట్స్ తెలిపారు. నూతన కార్యవర్గం నటీనటుల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆశీస్తున్నాన్న చిరంజీవి... మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబమన్నారు. ఎవరు గెలిచినా కుటుంబం గెలిచినట్టేనని, ఆ స్ఫూర్తితోనే అందరం ముందుకుసాగుదామని పిలుపు నిచ్చారు.
నాగబాబు రాజీనామా