గత కొన్నిరోజుల నుంచి సర్వత్రా ఆసక్తి కలిగించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(maa elections 2021) ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనల మినహా ప్రశాంతంగా పూర్తయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. 600కి పైగా 'మా' సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.
అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్.. ఎవరికీ వారే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. 8 గంటల తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు.
ఈసారి 'మా' చరిత్రలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. సూదుర ప్రాంతాల నుంచి వచ్చిన 'మా' సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడం వల్ల మా సభ్యుల్లో ఆనందం కనిపించింది.
'మా' ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, నాని, అల్లరి నరేశ్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు సాయికుమార్, బ్రహ్మానందం, పోసాని, మంచు లక్ష్మీ ప్రసన్న, తనికెళ్ల భరణి, జయప్రద, రోజా, రాశి, ప్రియమణి, జెనీలియా, పూనమ్‌కౌర్, చలపతిరావు, రవిబాబు, సుమన్, జీవీ సుధాకర్ నాయుడు, ఆర్.నారాయణమూర్తి, అలీ తదితరులు ఉన్నారు.
ఇవీ చదవండి: