ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి (ఏఐజీ)లో జరిగిన కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు, ప్రభుత్వ వాస్తు సలహదారుడు సుద్దాల సుధాకర్‌తేజ తాజాగా వెల్లడించారు.
సుద్దాల అశోక్‌తేజకు కాలేయమార్పిడి చికిత్స విజయవంతం
సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో (ఏఐజీ)లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆశోక్‌తేజ ఆరోగ్యం కుదటపడిందని ఆయన తమ్ముడు సుద్దాల సుధాకర్ తేజ వెల్లడించారు.
ఏఐజీ వైద్యులు రాజశేఖర్, బాలచందర్ నేతృత్వంలో శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అశోక్‌తేజకు, ఆయనకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఇవి విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చిన తన అన్నయ్య అశోక్‌తేజ తమతో మాట్లాడారని చెప్పారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన ఏఐజీ వైద్య బృందానికి, రక్తదానం చేసిన దాతలకు, చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు, ఎప్పటికపుడు వాకబు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి సుధాకర్‌తేజ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి... గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత