తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆయన తల్లి మదనమ్మ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె స్వగ్రామం చల్లగిరిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
సినీ రచయిత చంద్రబోస్‌కు మాతృ వియోగం - మదనమ్మ
టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్ తల్లి మదనమ్మ.. గుండెపోటుతో మరణించారు. ఆమె స్వగ్రామం చల్లగిరిలో అంత్యక్రియలు జరగనున్నాయి.
సినీ రచయిత చంద్రబోస్‌కు మాతృ వియోగం
నర్సయ్య, మదనమ్మ దంపతుల నలుగురు సంతానంలో అందరికంటే చిన్నవాడు చంద్రబోస్. తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. వారి మూలంగా చిన్నతనంలోనే చంద్రబోస్‌లో సాహిత్యబీజం పడింది.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన చంద్రబోస్... దూరదర్శన్‌లో సింగర్‌గా ప్రయత్నించాడు. అది ఫలించలేదు. అనంతరం తన స్నేహితుడి సూచన మేరకు గీత రచయితగా మారాడు. 1995లో తొలిసారిగా 'తాజ్ మహల్' అనే చిత్రానికి పాటలు రాశాడు.