తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూరీ మంచి స్నేహితుడు: ఛార్మి - puri jagannath, charmy kaur

దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెప్పింది నటి ఛార్మి. అతడు తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చింది.

పూరీ

By

Published : Sep 28, 2019, 5:42 PM IST

Updated : Oct 2, 2019, 9:05 AM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్ తనకు మంచి స్నేహితుడని అంటోంది హీరోయిన్, నిర్మాత ఛార్మి. నేడు (శనివారం) పూరీ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుందీ నటి.

పూరీ చాలా మంచి వ్యక్తి. వ్యాపార భాగస్వామి​గా, మంచి స్నేహితుడిగా అతడు ఉండటం నా అదృష్టం. కష్టపడే తత్వం ఉన్న అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని పూరీ కోరుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్​.
-ఛార్మీ, సినీ నటి-నిర్మాత

హీరో రామ్​.. సోషల్ మీడియా వేదికగా పూరీకి శుభాకాంక్షలు తెలిపాడు. "నా జీవితంలో ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం" అని చెప్పాడు.రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

'ఇస్టార్ట్ శంకర్' విజయం తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫైటర్​ అనే టైటిల్​ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవీ చూడండి.. హీరో వెంకటేశ్​ చేతుల మీదుగా 'త్రీమంకీస్' టీజర్

Last Updated : Oct 2, 2019, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details