ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం. అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇది జరుగుతున్నదే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు అగ్ర కథానాయకులు రీమేక్ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వాటిలో మలయాళ సూపర్‌హిట్ 'లూసిఫర్' ఒకటి. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
'లూసిఫర్' అంటే? రీమేక్‌లో ఈ మార్పులు చేస్తారా? - lucifer remake paruchuri gopalakrishna
'లూసిఫర్' రీమేక్ యథాతథంగా తీస్తే వచ్చే సమస్యలు, లోపాలను వివరించారు ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. లూసిఫర్ అంటే 'వేగుచుక్క', 'సైతాన్' అని అర్థం వస్తుందని చెప్పారు.
'పరుచూరి పలుకులు' పేరుతో ఆన్‌లైన్ వేదికగా సినిమా విశేషాలను విద్యార్థులకు ఆయన కొంత కాలంగా వివరిస్తున్నారు. ఇందులో భాగంగా 'లూసిఫర్'ను యథాతథంగా తీస్తే వచ్చే సమస్యలు, లోపాలను వివరించారు. తెలుగు నేటివిటీకి ఏయే మార్పులు చేస్తే బాగుంటుందో సూచించారు. అదే విధంగా 'లూసిఫర్' అంటే నిఘంటువులో రెండు అర్థాలు ఉన్నట్లు గోపాలకృష్ణ చెప్పారు. ఒకటి వేగుచుక్క, రెండు సైతాన్. ఈ రీమేక్‌లో ఏయే మార్పులు చేయాలో పరుచూరి పంచుకున్న అభిప్రాయాలను ఈ వీడియోలో చూడండి.
ఇదీ చూడండి: ఆమె వల్లే విలన్ పాత్రలు మానేశా: పరుచూరి