బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లవ్యాత్రి చిత్ర విషయంలో కండలవీరుడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతేడాది అక్టోబరు 5న విడుదలైన ఈ సినిమాకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) క్లియరెన్స్ ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఈ చిత్ర పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది.
ఒక్కసారి సీబీఎఫ్సీ సర్టిఫికేట్ మంజూరు చేశాక... నిర్మాతకు ఆ సినిమాను థియోటర్లలో విడుదల చేసే అర్హత ఉందని ఖాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.