తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో 'ఆకాశవాణి'.. 'లవ్​స్టోరీ' ట్రెండింగ్​ - నిర్మాత బండ్లగణేశ్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'మళ్ళీ మొదలైంది', 'ఆకాశవాణి', 'లవ్​స్టోరీ', నిర్మాత బండ్లగణేశ్​ నటిస్తున్న కొత్త మూవీ వివరాలు ఉన్నాయి. అవన్నీ మీ కోసం..

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Sep 16, 2021, 8:19 PM IST

Updated : Sep 16, 2021, 8:32 PM IST

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న విభిన్న కుటుంబ కథా చిత్రం 'మళ్ళీ మొదలైంది'(malli modalaindi sumanth). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 'అలోన్​ అలోన్'​ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. సెప్టెంబరు 19న పూర్తి పాటను రిలీజ్​ చేస్తామని తెలిపింది. సిద్​​ శ్రీరామ్ ఈ గీతాన్ని ఆలపించగా.. అనూప్​ రూబెన్స్​ మ్యూజిక్​ అందించారు. నైనా గంగూలీ కథానాయిక. కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రెడ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజశేఖర్‌ నిర్మాత. సుహాసిని, పోసాని కృష్ణమురళీ, మంజుల ఘట్టమనేని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఓటీటీలో 'ఆకాశవాణి'

అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న వైవిధ్యభరిత కథా చిత్రం 'ఆకాశవాణి'(akashvani movie). ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ఓటీటీ ప్లాట్​ఫాం 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. ​ఓ రేడియో చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌విలో జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల‌భైర‌వ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆకాశవాణి

'లవ్​స్టోరీ' ట్రెండింగ్​

నాగ్​చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్​స్టోరీ'(Lovestory trailer) సినిమా ట్రైలర్​ యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 7.5మిలియన్ల వ్యూస్​ను అందుకుంది. చైతూ ఇందులో తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్నారు. పల్లవి(sai pallavi love story) హీరోయిన్​గా చేసింది. పవన్.సీహెచ్​ సంగీతమందించగా, శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వం వహించారు. పి.రామ్మోహన్, నారాయణ్​దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించారు.

ఫస్ట్​లుక్​

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(bandla ganesh movies) కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వెంకట్ చంద్ర దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను సెప్టెంబరు 17(శుక్రవారం) సాయంత్రం 4గంటలకు దర్శకుడు హరీశ్​ శంకర్​ చేతుల మీదుల విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

తమిళంలో పార్తిబన్‌ నటించిన 'ఒత్త సెరుప్పు సైజ్‌7'కి తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ ఈ మధ్యే మొదలైంది. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌

బండ్ల గణేశ్​ కొత్త సినిమా
విజయ రాఘవన్​

ఇదీ చూడండి: యాక్షన్​ సీన్స్​తో తనీశ్​.. ప్రేమికుడిగా రక్షిత్

Last Updated : Sep 16, 2021, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details