అక్కినేని నాగచైతన్య(naga chaitanya movies), సాయి పల్లవి(sai pallavi movies) జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ ఖమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబర్ 24(lovestory release date)న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్(lovestory trailer)ను నేడు విడుదల చేశారు.
lovestory trailer: చైతూ, సాయి పల్లవి కెమెస్ట్రీ సూపర్! - నాగ చైతన్య లవ్‌స్టోరీ
నాగ చైతన్య, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటించిన 'లవ్‌స్టోరీ' ట్రైలర్(lovestory trailer) విడుదలైంది. చైతూ, పల్లవి జోడీ చూడముచ్చటగా ఉంది. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, బ్యూటిఫుల్ మ్యూజిక్‌తో ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.
లవ్‌స్టోరీ
ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. చైతూ, పల్లవి జోడీ చూడముచ్చటగా ఉంది. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, బ్యూటిఫుల్ మ్యూజిక్‌తో ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. ఈ చిత్రానికి పవన్.సీహెచ్ సంగీతమందించగా, పి.రామ్మోహన్, నారాయణ్‌దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించారు.