తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతూను శేఖర్​కమ్ముల చంపేయబోతున్నాడా..? - సాయి పల్లవి

విషాదాంతపు కథలు చిత్రసీమలో అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా స్టార్‌ కథానాయకులతో ఈ తరహా సాహసాలు చేయించడానికి దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే చైతూ-శేఖర్ కమ్ముల కాంబినేషన్​లో రూపొందే చిత్రం ఈ తరహాలోనే ఉండనుందని సమాచారం.

lovestory_movie-nagachaitanya-shekhar-kammula-saipallavi
చైతూని శేఖర్​కమ్ముల చంపేయబోతున్నాడా..?

By

Published : Jan 21, 2020, 7:05 AM IST

Updated : Feb 17, 2020, 8:01 PM IST

నాని.. 'జెర్సీ', కార్తికేయ.. 'ఆర్‌ఎక్స్‌ 100', కీర్తిసురేశ్.. 'మహానటి', చిరంజీవి.. 'సైరా..' వంటి విషాదాంతపు చిత్రాలు తెలుగు తెరపై విజయాలు సాధించాయి. ఇప్పుడీ విషాద కథల జాబితాలోకి నాగచైతన్య చిత్రం కూడా వచ్చి చేరబోతుందట. ప్రస్తుతం ఈ అక్కినేని హీరో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా సాయి పల్లవి నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. చైతన్య.. తెలంగాణ ప్రాంత కుర్రాడిగా కనిపించనున్నాడు. అయితే చిత్ర క్లైమాక్స్‌ను విషాదాంతంగా ముగించబోతున్నాడట శేఖర్‌ కమ్ముల.

ఇదొక సరికొత్త ప్రేమకథతో రూపొందుతోందని, క్లైమాక్స్‌లో చైతూ పాత్ర మరణం సినీప్రియులను కదిలిస్తుందని, తర్వాత సాయి పల్లవి.. అతడి జ్ఞాపకాలు తలచుకుంటూ గడపడం వల్ల సినిమా ముగించేలా క్లైమాక్స్‌ను ప్లాన్‌ చేసుకున్నాడట శేఖర్‌. మరి ఈ వార్తల్లో నిజమెంత? చైతూ తొలిసారి చేస్తోన్న ఈ తరహా సాహసం అతడికెలాంటి ఫలితాన్ని అందివ్వనుంది? వంటివి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Last Updated : Feb 17, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details