లవర్స్ డే టీజర్ విడుదల - omar lulu
వాలెంటైన్స్ డేకి లవర్స్ డే సినిమాతో అభిమానుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమా టీజర్ విడుదలైంది.
కన్నుగీటి సెన్సేషన్‌గా మారిన కథానాయిక ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళంలో ఆమె నటించిన చిత్రం "ఒరు అదార్ లవ్". ఈ చిత్రం తెలుగులో లవర్స్ డే పేరుతో వస్తోంది. దీనికి సంబంధించిన రిలీజ్ టీజర్ విడుదలైంది. ప్రధాన పాత్రలో రోషన్ అబ్దుల్ నటించాడు. పాఠశాల నేపథ్యంలో సినిమా మొత్తం సాగనుంది.
ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. షాన్ రెహమాన్ సంగీతమందించారు. ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది.