తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లవర్స్ డే: ప్రేమికుల నోట రావాలి ఈ పాట..! - Love Feel Songs

నేడు ప్రేమికుల దినోత్సవం. అంటే ప్రేమికులు తమ భావాలను ఒకరికొకరు మరింతగా ఇచ్చిపుచ్చుకునే రోజు. అందుకోసం పాటలూ ఉపయోగపడతాయి. గతేడాది నుంచి ప్రేక్షకుల్ని అలరించిన ప్రేమ పాటలు మీకోసం.

సినిమా
సినిమా

By

Published : Feb 14, 2020, 6:02 AM IST

Updated : Mar 1, 2020, 6:54 AM IST

ప్రేమ.. పలకడానికి రెండక్షరాలే. కానీ అందులో ఎంతో ఫీల్ ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికి ప్రేమికులు పడే తపన అంతా ఇంతా కాదు. అయితే వారికి ఎనలేని ప్రేమను చెప్పడానికి సినిమాలు ప్రయత్నిస్తుంటాయి. కొన్ని చిత్రాల్లోని పాటలు ప్రేమికుడి మనసులని భావాలకి అర్థాలవుతాయి. ఆ పాటను వింటూ అతడు లోకాన్ని మైమరిచిపోయేలా చేస్తాయి. అందులోనూ టాలీవుడ్​ ఈ ప్రేమ పాటలకి పెట్టింది చిరునామాగా మారింది. ఈ మధ్య అలా ప్రేక్షకుల, ప్రేమికుల హృదయాల్ని హత్తుకున్న ప్రేమ పాటలపై ఓ లుక్కేద్దాం.

ఊహలే ఊహలే (జాను)

తమిళంలో ఘనవిజయం సాధించిన 96కు తెలుగు రీమేక్ జాను. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. గోవింద వసంత ఇచ్చిన మ్యూజిక్ అలరించేలా ఉంటుంది. ఇందులో ఊహలే ఊహలే అంటూ సాగే పాట ఈ మూవీకి ఆత్మ లాంటింది.

ఉండిపోవ నువ్వివా, నీ కన్నులు (సవారి)

నందు, ప్రియాంక శర్మ జోడీగా నటించిన చిత్రం సవారి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ఉండిపోవ నువ్విలా, నీ కన్నులు అనే పాటలు సినిమాపై అంచనాల్ని పెంచాయి.

ఏమో ఏమో (రాహు)

అభిరామ్ వర్మ, క్రితి గార్గ్ జంటగా నటించిన చిత్రం రాహు. ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ ఆలపించిన ఏమో ఏమో సాంగ్ యువతకు బాగా కనెక్ట్ అయింది.

యూ ఆర్ మై హార్ట్ బీట్ (ఇద్దరి లోకం ఒకటే)

రాజ్​ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ఇద్దరి లోకం ఒకటే. ఈ సినిమాలోని యూ ఆర్ మై హార్ట్ బీట్ అనే సాంగ్ వినసొంపుగా ఉంటుంది. ప్రేమికులకు బాగా అట్రాక్ట్ చేసింది.

సామజవరగమన, బుట్ట బొమ్మా (అల వైకుంఠపురములో)

కొంత గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురింపించింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి సంగీతం కూడా కారణం. ఈ మూవీ కోసం తమన్ అందించిన పాటలు యూట్యూబ్ రికార్డుల్ని చెరిపేశాయి. యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందులో సామజవరగమన, బుట్టబొమ్మ ప్రేమి పావురాలను అలరించేలా ఉంటాయి.

కడలల్లె, ఎటు పోనే, నీ నీలి కళ్లల్లోన (డియర్ కామ్రేడ్)

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయినా.. పాటలు మాత్రం అలరించాయి.

నాలో మైమరపు (ఓ బేబీ)

సమంత హీరోయిన్​గా తెరకెక్కిన ఓ బేబీ మంచి విజయం సాధించింది. ఇందులో సామ్​ నటకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలోని నాలో మైమరపు అనే పాట చాలా బాగుంటుంది.

గగన వీధిలో (గద్దలకొండ గణేష్)

గద్దలకొండ గణేష్ చిత్రం మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్​కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇందులోని పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. గగన వీధిలో అనే సాంగ్ ప్రేమికులు పాడుకునేదిలా ఉంటుంది.

హొయినా హొయినా, నిన్ను చూసే ఆనందంలో (గ్యాంగ్​ లీడర్)

నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గ్యాంగ్​లీడర్. ఈ సినిమా వసూళ్ల విషయంలో వెనకపడ్డా పాటలు మాత్రం ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం బాగుంటుంది.

కోపంగా కోపంగా (మిస్టర్ మజ్ను)

అక్కినేని అఖిల్​ ఇప్పటివరకు మంచి హిట్​ను దక్కించుకోలేకపోయాడు. గతేడాది విడుదలైన ఈ హీరో సినిమా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఇందులోని కోపంగా కోపంగా అనే సాంగ్ మాత్రం ప్రేక్షకులకు దగ్గరైంది.

ప్రేమ వెన్నెలా (చిత్రలహరి)

వరుస ఫ్లాప్​లతో సతమతమవుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్​కు ఈ సినిమా మంచి విజయాన్నిచ్చింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధానబలం. ముఖ్యంగా ప్రేమ వెన్నెల అనే సాంగ్ ప్రేమికులక్ లవ్ ఆంథమ్​గా మారింది.

ప్రియతమ ప్రియతమ (మజిలీ)

అక్కినేని హీరో నాగ చైతన్య. తన భార్య సమంత కలిసి నటించిన తొలి చిత్రం మజిలీ. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందుకు మ్యూజిక్ కూడా తోడైంది. గోపి సుందర్ అందించిన సంగీతం యువతకు బాగా కనెక్ట్ అయింది.

కన్నే కన్నే (అర్జున్ సురవరం)

అర్జున్ సురవరం యువ హీరో నిఖిల్​కు మంచి విజయాన్ని అందించింది. ఇందులో జర్నలిస్టుగా నటించిన నిఖిల్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. ఇందులోని కన్నే కన్నే సాంగ్ ప్రేమికులను అలరించేలా ఉంటుంది.

నీ పరిచయముతో (చూసి చూడంగానే)

శివ కందుకూరి, వర్ష బొలమ్మ, మాలవిక సతీషన్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం చూసి చూడంగానే. ఈ సినిమాలోని నీ పరిచయముతో అనే పాట మెలోడియస్​గా బాగుంటుంది. సిద్ శ్రీరామ్ గాత్రం హైలెట్​.

ప్రేమ ఓ ప్రేమ (ఎన్​జీకే)

సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఎన్​జీకే. ఈ సినిమాలోని ప్రేమ ఓ ప్రేమ అనే పాట ప్రేమికులను అలరిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో రూపొందిన ఈ పాటను సిద్​ శ్రీరామ్ ఆలపించాడు.

నీలి నీలి ఆకాశం (30రోజుల్లో ప్రేమించడం ఎలా)

యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇటీవల ఇందులోని నీలి నీలి ఆకాశం అనే పాట విడుదలై ఆకట్టుకుంటోంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, సిద్ శ్రీరామ్ గాత్రం అలరించేలా ఉంది.

Last Updated : Mar 1, 2020, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details