బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోనీ. చివరిగా ఆమె వెండితెరపై 2019లో విడుదలైన హిందీ చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో అతిథి పాత్రలో కనిపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు కుటుంబంతో సహా వెళ్లింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ప్రస్తుతం భారత్‌కు వచ్చి షూటింగ్‌ల్లో పాల్గొంటోంది.
సన్నీ గోవా లుక్స్.. చూస్తే మతిపోవాల్సిందే! - గోవాలో సందడి చేస్తోన్న సన్నీ లియోనీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీ తాజాగా నెట్టింట కొన్ని ఫొటోలు షేర్ చేసింది. గోవాకు సంబంధించిన ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
సన్నీ గోవా లుక్స్.. చూస్తే మతిపోవాల్సిందే!
తాజాగా గోవాకు సంబంధించిన పలు ఫొటోలను నెట్టింట ఫోస్ట్ చేసింది సన్నీ. ఈ గోవా లుక్ చాలా బాగుందంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అనామిక' చిత్రంలో నటిస్తోంది సన్నీ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.