తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపాలు ఈ చిత్రాలు! - fahter,daughter relationship based movies

ఇటీవలే ఓటీటీలో విడుదలైన 'గుంజన్​ సక్సేనా :ది కార్గిల్​ గర్ల్'​ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తండ్రి, కుమార్తెల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు శరణ్​ శర్మ. అయితే, దక్షిణాదిలోనూ డాటర్​, ఫాదర్​ రిలేషన్​షిప్​తో​ కూడిన సినిమాలు అనేకం వచ్చాయి. వాటిలో టాప్​-10 సూపర్​హిట్​ చిత్రాలపై ఓ లుక్కేద్దాం రండి.

Loved 'Gunjan Saxena'? 10 south films with unique father-daughter bond
తండ్రి, కుమార్తెలు

By

Published : Aug 18, 2020, 7:30 PM IST

ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న చిత్రం 'గుంజన్​ సక్సేనా: ది కార్గిల్​ గర్ల్'​. భారత నావికా దళంలో చేరిన తొలి భారతీయ మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. ఇటీవలే నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన ఈ చిత్రానికి.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో జాన్వి కపూర్​, పంకజ్​ త్రిపాఠి.. తండ్రి, కుమార్తెలుగా అద్భుతమైన నటన కనబరిచారు. వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయత అనురాగాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా సినిమాను రూపొందించారు దర్శకుడు శరణ్​ శర్మ.

కథేమిటంటే..

గుంజన్​ ఆర్మీ కుటుంబానికి చెందిన యువతి. చిన్నప్పటి నుంచి విమానం నడపాలనేది ఆమె కల. కానీ ఆ కోర్సు చాలా ఖరీదైంది కాబట్టి.. తన తండ్రి సూచన మేరకు ఐఏఎఫ్​లో చేరాలని నిశ్చయించుకుంటుంది. ఆమె సోదరుడు, తల్లి గుంజన్​ కెరీర్​ ఎంపిక విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. తండ్రి మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తుంటాడు. తన కుమార్తె కలను నెరవేర్చేందుకు నిరంతరం తపిస్తుంటాడు.

ఇలా తండ్రి, కుమార్తెల మధ్య చక్కటి అనుబంధంతో కూడిన కథతో ఇంతకుముందు దక్షిణాదిలోనూ పలు సూపర్​హిట్​ సినిమాలు తెరకెక్కాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

రామ్​ దర్శకత్వంలో 2018లో వచ్చిన తమిళ చిత్రం 'పెరంబు'. మమ్ముట్టి, సాధన ప్రధాన పాత్రలో నటించారు. ఒక తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ సినిమా సాగుతుంది. కథలోకి వెళ్తే మొదట్లో తండ్రి, కుమార్తెల మధ్య సన్నిహిత్యం అంతగా కనిపించదు. అయితే, భార్య విడిచిపెట్టి వెళ్లిన తర్వాత పాపను చూసుకొనే బాధ్యత తండ్రిపై పడుతుంది. అప్పటి నుంచి చిన్నారికి అన్నీ తానై చూసుకుంటాడు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం 1990లో తెరకెక్కించిన చిత్రం 'అంజలి'. మానసిక వైకల్యం ఉన్న ఒక చిన్నపిల్ల(షామిలి) చుట్టూ సినిమా నడుస్తుంది. పుట్టుకతోనే అనారోగ్యంపాలై.. కొన్ని నెలల్లో చనిపోయే అవకాశం ఉందని చిన్నారి తండ్రి(రఘువరన్​)కు వైద్యులు చెబుతారు. అయితే, కుటుంబ సభ్యులు బాధపడకుండా ఉండేందుకు పాప పుట్టలేదని చెప్పమని వైద్యులు అతనికి సూచిస్తారు. కానీ, చివరి వరకు తండ్రే పాపను కంటికిరెప్పలా చూసుకుంటాడు.

బోయిన్నా సుబ్బారావు 2001లో దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రేమించు'. ఒక అంధ మహిళ గురించి ఈ సినిమా రూపొందించారు. లయ హీరోయిన్​. తన వైకల్యాన్ని లెక్క చేయకుండా స్వశక్తితో న్యాయవాది వృత్తిని చేపడుతుంది లయ. ఆ ప్రయాణంలో తనకు నిత్యం తోడుగా నిలిచిన తన తండ్రికి కృతజ్ఞురాలిగా ఉంటుంది. వైకల్యంతో పుట్టిన పాపను వదిలేయడంపై తల్లిదండ్రుల మధ్య గొడవ చెలరేగి విడాకులు తీసుకుంటారు. అప్పటి నుంచి చిన్నారి బాగోగులు తండ్రే చూసుకుంటాడు.

అరుణ్​రాజా కామరాజ్​ దర్శకత్వంలో 2018లో వచ్చిన తమిళ క్రీడా చిత్రం 'కనా'. ఐశ్వర్యా రాజేశ్​, సత్యరాజ్​ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెటర్​ కావాలనుకునే ఓ యువతి కథే ఈ సినిమా. ఇందులో తండ్రి క్రికెట్​ ప్రేమికుడు.. అతని వల్లే కుమార్తెకు క్రీడపై ఆసక్తి కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా తన కుమార్తె ఆశయాలకు మద్దతుగా నిలుస్తూ.. కంటికి రెప్పలా చూసుకుంటాడు.

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'ఫిదా'. తన తండ్రిని ఒంటరిగా విడిచిపెట్టేందుకు ఇష్టపడని గడుచు పిల్ల భానుమతి(సాయి పల్లవి) చుట్టూ సినిమా తిరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ చిత్రంలోని కొన్ని డైలాగ్​లు నెట్టింట సందడి చేస్తూనే ఉంటాయి.

2008లో రాధా మోహన్​ తెరకెక్కించిన సినిమా 'అభియూమ్​ నానుమ్'. తెలుగులో 'ఆకాశమంత'గా విడుదలైంది. ప్రకాశ్​ రాజ్(రఘురామ్​)​, త్రిష(అభి) నటించిన ఈ చిత్రంలో తండ్రి కుమార్తెను అమితంగా ప్రేమిస్తుంటాడు. ఆమె ఎక్కడికెళ్లినా వెన్నంటే ఉండి కంటికి రెప్పలా చూసుకునే వాడు. తన కుమార్తె కోణం నుంచి ఆలోచించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. అంతలా ఆమెను ప్రేమిస్తుంటాడు.

జ్యూడ్​ ఆంథోనీ జోసెఫ్​ 2014లో దర్శకత్వం వహించిన మలయాళ సినిమా 'ఓం శాంతి ఓషానా'. పూజా మాథ్యూ అనే ఒక అమ్మాయి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. పూజ తండ్రికి మొదట తన భార్య అబ్బాయిని ప్రసవించిందని వైద్యులు చెబుతారు. తర్వాత అది అమ్మాయి అని తేలుతుంది. అయినప్పటికీ తండ్రి నిరాశ చెందకుండా కుమార్తెను ప్రేమగా చూసుకుంటాడు. కుమార్తెకు తన ఇష్టానుసారం నడుచుకునే స్వేచ్ఛను ఇస్తాడు. వినోదభరితంగా సాగే ఈ సినిమా మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

రామ్​ దర్శత్వంలో 2013లో వచ్చిన సూపర్​ హిట్​ చిత్రం 'తంగా మీనక్కల్'​. చదువుపై ఆసక్తి చూపని తన కుమార్తె కోసం తండ్రి పడే తపన తెలుపుతూ​ సినిమా తెరకెక్కించారు. తన కుమార్తె సంతోషాన్ని మాత్రమే కోరుకునే తండ్రి.. ఆమెకు అన్నివేళలా తోడుగా నిలుస్తూ తనలోని భయాన్ని పోగొడతాడు. ఈ చిత్రం చిన్న పిల్లల సృజనాత్మకతను దెబ్బతీసే దేశంలోని విద్యావవస్థకు అద్దం పడుతుంది.

2019లో అరుణ్​ పీఆర్​ దర్శకత్వం వహించిన సినిమా 'ఫైనల్స్'​. ఒలింపిక్స్​లో పాల్గొనాలనుకునే ఒక సైక్లిస్ట్​ అమ్మాయి కథే ఈ చిత్రం. ఆమె ఆశయాలకు మద్దతుగా నిలుస్తుంటాడు తండ్రి. తనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు అడ్డుగా నిలబటి అన్ని అవసరాలను చూసుకుంటాడు.

మలయాళ దర్శకుడు అశోకన్ 2019లో​ తెరకెక్కించిన సినిమా 'ఉయారే'. పైలట్​ కావాలని కోరుకునే పల్లవి(పార్వతి) చుట్టూ సినిమా నడుస్తుంది. ఆమె ప్రియుడు గోవింద్​(ఆసీఫ్​ అలీ) మంచివాడు కాదు. ఆ విషయంలో పల్లవి తండ్రి అసంతృప్తిగా ఉంటాడు. కొద్ది రోజులకు అతని స్వభావం తెలుసుకున్న పల్లవి విడిపోవాలని అనుకుంటుంది. అందుకు ఆగ్రహించిన ప్రియుడు ఆమెపై యాసిడ్​ పోస్తాడు. కానీ, పల్లవిని ఆమె తండ్రి అసలు నిందించడు. చట్టపరమైన చర్యలతో న్యాయం జరిగేలా చేసి.. ఎయిర్​ హోస్టెస్​ కావాలనే ఆమె కలకు మద్దతుగా నిలుస్తాడు.

ABOUT THE AUTHOR

...view details