తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా సరే ఇంకా అవి తెరుచుకోలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సినిమాలు విడుదల తేదీలపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న 'లవ్‌స్టోరి', 'టక్ జగదీష్' తదితర చిత్రాలు ఆరోజు రానున్నాయంటూ మాట్లాడేసుకుంటున్నారు.
కరోనా రెండోదశ తర్వాత థియేటర్లలోకి తీసుకొస్తున్న తొలి సినిమా 'తిమ్మరుసు'. జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్‌స్టోరి' చిత్రాన్ని ఆగస్టు 7న రిలీజ్ చేయనున్నారని, నాని 'టక్ జగదీష్'ను ఆ తర్వాత వారం థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మాట్లాడుకుంటున్నారు.