తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్​తో నాగచైతన్య.. టైటిల్​ సాంగ్​తో 'అల్లుడు అదుర్స్​' ​ - సత్యదేవ్​ గాడ్సే

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'లవ్​స్టోరి' టీజర్, 'అల్లుడు అదుర్స్​' టైటిల్​ సాంగ్​తో పాటు గాడ్సే సినిమా అప్​డేట్స్​ అందులో ఉన్నాయి. ​

Love Story movie teaser, Alludu Adhurs Title Song Lyrical released
టీజర్​తో నాగచైతన్య.. టైటిల్​ సాంగ్​తో 'అల్లుడు అదుర్స్​' ​

By

Published : Jan 10, 2021, 1:51 PM IST

  • నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్​ను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. రేవంత్‌ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్‌ సీహెచ్‌ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.
  • సంతోష్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్​, నభా నటేష్​ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అల్లుడు అదుర్స్​'. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఇందులోని టైటిల్​ సాంగ్​ లిరికల్​ వీడియోను సోషల్​మీడియాలో విడుదల చేశారు.
  • యువ కథానాయకుడు సత్యదేవ్​ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'గాడ్సే'. 'బ్లఫ్​ మాస్టర్​' ఫేమ్​ గోపీ గణేశ్​ దర్శకత్వంలో.. సీకే కల్యాణ్​ నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్​ సరసన హీరోయిన్​గా మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మిని చిత్రబృందం ఎంపిక చేసింది.
    'గాడ్సే' చిత్రంలో హీరోయిన్​గా ఐశ్వర్యా లక్ష్మి

ABOUT THE AUTHOR

...view details