తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ ఘటనకూ 'లవ్​స్టోరి'కి సంబంధం లేదు' - లవ్​స్టోరీ

'లవ్​స్టోరి'(love story movie release date) సినిమాపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాంమోహన్​ రావు. మిర్యాలగూడ ఘటనకు తమ చిత్రానికి ఎక్కడా సంబంధం లేదని తెలిపారు.

lovestory
లవ్​స్టోరీ

By

Published : Sep 18, 2021, 5:31 AM IST

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరి'(love story movie release date) చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాంమోహన్ రావు ఖండించారు. మిర్యాలగూడ ఘటనకు తమ చిత్రానికి ఎక్కడా సంబంధం లేదని స్పష్టం చేశారు. పూర్తిగా శేఖర్ కమ్ముల తరహాలో సాగే చిత్రం అని పేర్కొన్న ఆయన.. సెప్టెంబర్ 24న తమ మూవీ తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోని 600కుపైగా థియేటర్లలో 'లవ్ స్టోరి'ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు రాంమోహన్ రావు. అయితే ఆంధ్రప్రదేశ్​లో నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా నిర్ణీత సమయానికి కన్నా ముందే 'లవ్ స్టోరి' ప్రదర్శనలను మొదలుపెట్టి 4 ఆటలు ఆడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. 'వకీల్ సాబ్' కన్నా ముందే రావల్సిన తమ చిత్రాన్ని పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చామని వివరించారు. 'లవ్ స్టోరి' కోసం ఓటీటీల నుంచి భారీ ఆఫర్ వచ్చినా ప్రేక్షకుల కోసం థియేటర్​లోనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

'లవ్​స్టోరి'లో (love story movie naga chaitanya sai pallavi) నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. చైతూ ఇందులో తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్నారు. పల్లవి(sai pallavi love story) హీరోయిన్​గా చేసింది. పవన్.సీహెచ్​ సంగీతమందించగా, శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వం వహించారు. పి.రామ్మోహన్, నారాయణ్​దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించారు.

ఇదీ చూడండి:lovestory trailer: చైతూ, సాయి పల్లవి కెమెస్ట్రీ సూపర్!

ABOUT THE AUTHOR

...view details