తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైరల్​: సారా, కార్తీక్​ లెమన్​ స్పూన్​ డాన్స్​ - లెమన్​ స్పూన్​ డాన్స్​

నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ తారలు సారా అలీఖాన్​, కార్తీక్​ ఆర్యన్ మరోసారి వైరల్​ అయ్యారు. వినూత్నంగా ఈ జంట చేసిన డ్యాన్స్​ సినీప్రియుల్ని ఎంతగానో అకట్టుకుంటోంది. సారా పంచుకున్న ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Love Aaj Kal duo Sara Ali Khan and Kartik Aaryan twist the lemon and spoon race to a fun dance video
వైరల్​: సారా, కార్తీక్​ లెమన్​ స్పూన్​ డాన్స్​

By

Published : Feb 2, 2020, 5:53 PM IST

Updated : Feb 28, 2020, 9:57 PM IST

నిత్యం అనేక పుకార్లతో వార్తల్లో నిలిచే సారా అలీఖాన్​, కార్తీక్ ఆర్యన్​ ఇప్పుడు మరోసారి వైరల్​ అయ్యారు. అయితే ఈసారి ఈ జంట అందర్ని ఆశ్చర్యానికి గురిచేసి నవ్వులు చిందించింది. 'లవ్​ ఆజ్​ కల్​' చిత్రంలో నటిస్తోన్న సారా, కార్తీక్​ నోటిలో స్పూన్​, నిమ్మకాయ పెట్టుకుని సరదాగా డ్యాన్స్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

"జీవితంలో ప్రతిదీ ఒత్తిడిగానే ఉంటుందని నమ్ముతా.. ప్రతిరోజు నేను చేసే పనిని ఎంతో ప్రేమిస్తా. ఎప్పుడూ దాన్ని ఒత్తిడిగా భావించను. కానీ నేను ప్రముఖ నటుడు సైఫ్​ అలీఖాన్​, అమృతల కుమార్తెననే విషయమే కాస్త ఒత్తిడిని కలిగిస్తోంది. వారి కుమార్తె అయినందుకు గర్వంగా ఉంది."
- సారా అలీఖాన్​, బాలీవుడ్​ నటి

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కార్తీక్​తో కలిసి నటించిన 'లవ్​ ఆజ్​ కల్' చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి ఇంతియాజ్​ అలీ దర్శకుడు. హోమీ అడ్జానియా, దినేశ్​ విజన్​ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి...'బ్రహ్మస్త్ర' విడుదల తేదీ ఫిక్స్.. మార్పుల్లేవు: అమితాబ్

Last Updated : Feb 28, 2020, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details