తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆటోరిక్షా' యానిమేషన్​తో కడుపుబ్బా నవ్వులు

'నగుమోము' పేరుతో ఓ వ్యక్తి తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన యానిమేషన్​ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఇలాంటి యానిమేషన్​ రూపొందించిన ఆ వ్యక్తి ఎవరు?

'ఆటోరిక్షా' యానిమేషన్​తో కడుపుబ్బా నవ్వులు

By

Published : Nov 6, 2019, 5:11 AM IST

తమలోని విభిన్నత, టాలెంట్​ను ప్రదర్శిస్తూ ఎందరో వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే 'నగుమోము' పేరుతో వచ్చిన ఓ యానిమేటెడ్​ ఆటో ట్యూన్​నూ ఆనంద్​బాబు ఇలానే రూపొందించాడు. తన ప్రత్యేకతను చాటుకునేందుకు పాత తరం పాటలకు యానిమేషన్​ రూపొందించి వీక్షకుల మన్ననలు పొందుతున్నాడు.

ఆయన రూపొందించిన నగుమోము వీడియో ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. బ్యాక్​గ్రౌండ్​లో త్యాగరాజు పాడిన సంకీర్తనలు వస్తుంటాయి. వాటికి తగ్గట్లుగా యానిమేషన్​లో ఆటోరిక్షా ఎగురుతూ ఉంటుంది. దీనిని రూపొందించిన 31ఏళ్ల ఆనంద్... ఇప్పుడు చాలా ఫేమస్​ అయ్యాడు. తిరువనంతపురానికి చెందిన ఆయన ఓ​ యానిమేషన్ సంస్థలో కోర్సు చేసి అక్కడే ఆరు సంవత్సరాలు పని చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఆయన... ఓ ప్రముఖ సంస్థలో యానిమేషన్ డైరెక్టర్​గా చేస్తున్నాడు.

వృత్తి మీద ఉన్న ఇష్టం, సృజనాత్మకతతో ఏదైనా చేయాలన్న తపనతోనే 'ఆటోరిక్షా' యానిమేషన్​ను రూపొందించాడట ఆనంద్. ఆ వీడియో తన ఇన్​స్టాగ్రామ్​లో ఆదివారం పోస్ట్ చేయగా.... క్షణాల్లో వేలల్లో లైక్​లు వచ్చాయి. ఇప్పటి వరకు 58వేలకు పైగా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూశారు.

1997లో విడుదలైన తమిళ్​ సినిమా 'నీరమ్​'లోని ఓ పాటతో...ఇదే తరహాలో 2015లో 'పిస్తా సాంగ్'​ పేరుతో ఓ వీడియో రూపొందించాడు ఆనంద్​. ఈ పాట బాదం, పిస్తా, వేరుశనగ, జీడిపప్పు వంటి వాటితో యానిమేషన్​ బొమ్మలు సృష్టించి వాటితో స్టెప్పులు వేయించాడు. పాత పాటలను జోడించి యానిమేషన్​ చేయడం వల్ల ఈ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details