తనదైన డైలాగ్ డెలివరీ, యాక్షన్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న నటుడు మోహన్‌బాబు. అందుకే ఆయన 'డైలాగ్ కింగ్' అనిపించుకున్నారు. ఏ డైలాగ్‌ను ఎలా పలకాలో తెలిసిన అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. మరి అలాంటి వ్యక్తి తన విలక్షణ గొంతుతో వినాయకచవితి కథ చదివితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుందని అంటున్నారు.
వినాయకుడి కథ నటుడు మోహన్‌బాబు చెబితే? - VINAYAKA STORY BY ACTOR MOHANBABU
శనివారం వినాయక చవితి ఉన్న సందర్భంగా స్వయంగా ఆ దేవుడి కథను చెప్పారు సీనియర్ నటుడు మోహన్‌బాబు. ఆ వీడియోను హీరో విష్ణు పోస్ట్ చేశారు.
శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని 'వినాయక చవితి కథ'ను ఆయన గొంతుతో వినిపించారు. 'నేను చదవడం, వినడం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నాకు ఇష్టమైన పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో నేను మొదటిగా ఇష్టపడేది వినాయకచవితి. ఏటా మా కుటుంబ సభ్యులతో పాటు, కొందరు సన్నిహితులను ఇంటికి పిలిచి, నేనే స్వయంగా పుస్తకంలో ఉన్న మంత్రాలను చదివి, కథ వినిపించడం నాకు అలవాటు. ఆ అలవాటను మీ అందరికీ వినిపించాల్సిందిగా నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు నన్ను కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా విఘ్నేశ్వరుడి కథను మీకు వినిపిస్తున్నా' అంటూ మోహన్‌బాబు కథ చెప్పారు.