మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'డిస్కోరాజా'. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్య హోప్ హీరోయిన్లు.ప్రీరిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో మాట్లాడిన రవితేజ.. ఈ సినిమాకు సీక్వెల్ ఉండొచ్చనే తీపి కబురును అభిమానులతో పంచుకున్నాడు.
"డిస్కోరాజా' చిత్రీకరణ సమయంలో నేనెంత ఎంజాయ్ చేశానో.. అంతకుమించి మీరు ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన పాత్రలను ఆనంద్ నాకు చెప్పారు. అందుకే వెంటనే సినిమాకు ఓకే చెప్పా. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించా. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీనికి సీక్వెల్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో ఇది నాకు పదకొండో సినిమా. ఈ సినిమాలో సైఫై సెట్ అద్భుతం"