మాదక ద్రవ్యాలకు బానిసలైన మురికివాడల పిల్లల్ని ఫుట్‌బాల్ ఆటగాళ్లగా తీర్చిదిద్దడానికి ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ విజయ్ బార్సే చాలా కృషి చేశాడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది 'ఝుండ్'. అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. 'సైరత్' ఫేమ్ నాగ్‌రాజ్ ముంజులే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
తెరపై ఫుట్‌బాలర్ బయోపిక్.. అమితాబ్ కీ రోల్ - అమితాబ్ బచ్చన్ ఝుండ్
ఫుట్‌బాల్ ఆటగాడు విజయ్ బార్సే జీవిత కథను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్‌రాజ్ ముంజులే. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రముఖ పాత్రలో దర్శనమివ్వనున్నారు.
![తెరపై ఫుట్‌బాలర్ బయోపిక్.. అమితాబ్ కీ రోల్ Looking forward to upcoming Amitabh Bachchan Jhund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5794144-222-5794144-1579658149404.jpg)
తెరపై ఫుట్‌బాల్ ఆటగాడి జీవితం
ఇందులో ఎక్కడా అమితాబ్ కనిపించరు. 'కొంతమంది బ్యాట్లు, చైన్లు పట్టుకొని నడిచొస్తుంటే గుంపు కాదు సార్.. టీమ్' అంటూ అమితాబ్ గొంతు వినిపిస్తుంది. ఈ ఏడాది మే 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇదీ చదవండి:రామ్ చరణ్ వద్దంటే.. నాని చేశాడట..!
Last Updated : Feb 17, 2020, 10:58 PM IST