ప్రముఖబాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'దబాంగ్ 3'. ఈ మూవీలో సోనాక్షి సిన్హా కథానాయిక. ఇటీవలె ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సోనాక్షి.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకవేళ దర్శకులు మీతో 'లేడీ దబాంగ్' సినిమాను తీస్తామంటే మీ అభిప్రాయమేంటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానమిచ్చిన ఈ భామ.. హీరో ప్రధానంగా సాగే చిత్రాలకు పెట్టే బడ్జెట్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలిపింది.
"నేను చాలా మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించాను. కానీ స్టార్ హీరోల మూవీలతో పోలిస్తే నా సినిమాలకు పెట్టే ఖర్చు దరిదాపుల్లో కూడా ఉండదు. హీరోల చిత్రాలను ప్రోత్సాహించినట్టు కథానాయిక ప్రాధాన్యం ఉన్న మూవీలనూ ప్రేక్షకులు ప్రోత్సాహిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. అలాంటి దశకు చేరుకోడానికి కొంత సమయం పడుతుంది."