తమిళ హీరో కార్తీ నటించిన సూపర్ హిట్ చిత్రం 'ఖైదీ'తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. తాజాగా మరో సినిమా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు లేదా రామ్ చరణ్‌ను ఎంచుకోనునట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిసోంది. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన 'మాస్టర్' సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు లోకేశ్.
'ఖైదీ' దర్శకుడి చిత్రంలో వీరిలో ఎవరు హీరో! - master latest news
ఇలయదళపతి విజయ్ హీరోగా 'మాస్టర్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. తాజాగా తన తర్వాత చిత్రం కోసం టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఇద్దరిని పరిశీలిస్తున్నట్లు సమాాచారం. వారిలో ఒకరితో ఈ ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
కనగరాజ్
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. 'మాస్టర్' చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇటీవలే ఓటీటీ ప్లాట్ఫామ్లో 'మాస్టర్' సినిమా విడుదలకు సిద్ధమైనట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే అవన్నీ పుకార్లని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.