బాలీవుడ్ ప్రముఖులు ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రజినీకాంత్, ఆశాభోంశ్లే, ధర్మేంద్ర, ఏక్తా కపూర్, పరేశ్ రావల్ తదితరులు భాజపాకు శుభాకాంక్షలు తెలిపారు.
"ఈవీఎమ్లే కాదు.. టీవీ రిమోట్లు కూడా హ్యాక్ అయ్యాయనుకుంటా.. ఏ టీవి చూసిన ఎన్డీఏకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను చూపిస్తున్నాయి" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు పరేశ్ రావల్.
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర తన కుమారుడికి(సన్నీదేఓల్కు), ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇరువురి ఫొటోలతో ట్వీట్ చేశారు. "ఫకీర్ బాద్ షా(పేదల రారాజు) మోదీ, ధరితి పుత్ర సన్నీ దేఓల్కు శుభాకాంక్షలు. మంచి రోజులు రాబోతున్నాయి" అంటూ ట్వీటాడు. తన భార్య హేమమాలినికీ శుభాభినందనలు తెలిపారు. హేమమాలిని మథురలో ఆధిక్యంలో ఉన్నారు.
"గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. మీరు మళ్లీ గెలిచారు!!! దేవుడి ఆశీస్సులు మీకుండాలి" అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశాడు.
"ప్రజలు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రుజువు చేసుకున్నారు" అంటూ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ట్వీటింది.