తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఒక్క లాక్​డౌన్​తో ఆ విషయాలన్ని తెలుసుకున్నా'

కరోనా లాక్​డౌన్​తో చాలా విషయాల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​. ఈ విరామంలో తెలుసుకున్న కొత్త అంశాలు, తన జీవితకాలంలో ఎప్పుడూ నేర్చుకోలేదని వెల్లడించారు.

Lockdown taught me what I was unable to learn during my entire 78 years: Amitabh
'78 ఏళ్లలో ఆ విషయాలు ఎప్పుడూ నేర్చుకోలేదు'

By

Published : May 31, 2020, 2:46 PM IST

లాక్​డౌన్​లో నేర్చుకున్న, అర్థం చేసుకున్న విషయాలు.. తన 78 ఏళ్ల​లో ఎప్పుడూ చేయలేకపోయానని మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్ అన్నారు​. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ట్విట్టర్​లో ఓ ఫొటోను పంచుకున్నారు.

"ఈ లాక్​డౌన్​లో నేను నేర్చుకుని, తెలుసుకోగలిగిన విషయాలు.. నా 78 ఏళ్లలో ఏనాడు చేయలేదు, అర్థం చేసుకోలేదు. అందుకే ఇప్పడీ నిజాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఏదైన కొత్త విషయాన్ని నేర్చుకోవడమంటే దాన్ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం మాత్రమే"

- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ దిగ్గజ నటుడు

కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన అమితాబ్​.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్​లో ఉన్నారు. ఎప్పటికప్పుడు పలు చిత్రాలను పోస్ట్​ చేస్తూ వారిని అలరిస్తున్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా, ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కొన్ని వీడియోలనూ పంచుకున్నారు.

ఇదీ చూడండి...'అల్లూరి' డైలాగ్​తో కృష్ణకు యువహీరో విషెస్

ABOUT THE AUTHOR

...view details