తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కుమారుడి తాళానికి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే - కుమారుడికి డ్యాన్స్​ గురువుగా మారింది నటి మాధురీ దీక్షిత్

క్వారంటైన్ సమయంలో కుమారుడికి డ్యాన్స్ నేర్పిస్తూ​ గురువుగా మారింది నటి మాధురీ దీక్షిత్. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

Lockdown dairies: Madhuri twirls to beat as son plays tabla
కుమారుడి తాళానికి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే

By

Published : Apr 15, 2020, 1:26 PM IST

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.. కుమారుడు ఆరిన్​కు క్లాసికల్​ డ్యాన్స్ నేర్పిస్తూ బిజీగా ఉంది. దీనితో పాటే అతడు తబాలా వాయిస్తుండగా, అందుకు అనుగుణంగా కాళ్లకు గజ్జెలు కట్టుకుని డ్యాన్స్​ చేసింది. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

మనకు నచ్చిన పనులు మనం చేసుకునేందుకు, ఈ క్వారంటైన్ సమయం బాగా ఉపయోగపడుతుందని మాధురీ ఇన్​స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పలు వెబ్​సిరీస్​ల్లో నటిస్తూ, కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.

ఇదీ చూడండి : కరోనా జాగ్రత్తలపై ప్రజలకు మెగా ఫ్యామిలీ సందేశం

ABOUT THE AUTHOR

...view details