ఈ ఏడాది.. ఎన్నో జ్ఞాపకాలతో పాటు కొన్ని చేదు వార్తల్ని మిగిల్చింది. టాలీవుడ్లో పలువురు ప్రముఖలు ఈ సంవత్సరంలోనే తుదిశ్వాస విడిచారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన వారు.. అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. ఈ జాబితాలో సీనియర్ నటి అంజలి దేవి, దర్శకురాలు విజయ నిర్మల, దర్శకుడు కోడి రామకృష్ణ, నటులు రాళ్లపల్లి నరసింహారావు, గొల్లపూడి మారుతీరావు, వేణు మాధవ్ తదితరులు ఉన్నారు.
గొల్లపూడి మారుతీరావు-నటుడు, రచయిత
టాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు.. డిసెంబర్ 12న కన్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవి 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్లో ఆరు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
కోడి రామకృష్ణ-దర్శకుడు
తెలుగు సినిమా స్థాయిని పెంచిన శతచిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ.. జూన్ 22న తుదిశ్వాస విడిచారు. 90లలో ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. కుటుంబ కథా చిత్రాలు తీస్తూనే.. 'అమ్మోరు', 'దేవి', 'దేవీపుత్రుడు', 'అంజి', 'అరుంధతి' వంటి ఫాంటసీ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
వేణు మాధవ్-హాస్య నటుడు
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్.. సెప్టెంబర్ 25న మృతి చెందాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 39 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగాడు.
విజయనిర్మల-దర్శకురాలు