ప్రముఖ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. ఈ హీరోయిన్ కారు డ్రైవర్ సెల్వకుమార్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా ముత్తుక్కాడు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు 100కుపైగా లిక్కర్ బాటిల్స్‌ను గుర్తించారు. డ్రైవర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టివేత - Ramya Krishna latest news
ప్రముఖ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. దీంతో ఆమె డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై రమ్యకృష్ణ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా లేదు.
![నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టివేత Liquor bottle seized from Actress Ramya Krishnan's car](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7603528-thumbnail-3x2-ramya.jpg)
రమ్యకృష్ణ
ఈ విషయాన్ని తెలుసుకున్న రమ్యకృష్ణ బెయిల్‌తో పోలీసు స్టేషన్‌కు వెళ్లి డ్రైవర్‌ను విడిపించిందని సమాచారం. కానీ దీనిపై ఈ నటి నుంచి ఎటువంటి స్పందనా లేదు. ప్రస్తుతం ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
Last Updated : Jun 13, 2020, 6:14 PM IST