Ram Pothineni: రామ్ మరోసారి తన యాక్షన్ సత్తా చూపెట్టడానికి భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఐదు భారీ సెట్లలను ఈ సినిమా కోసం తీర్చిదిద్దారు. వాటిల్లోనే రామ్, ఆది పినిశెట్టి తదితరులపై కీలకమైన పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తోంది.
హీరోగా బాల నటుడు..