తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దేవరకొండ 'వర్క్​ ఫ్రమ్​ హోం'.. రిలీజ్​ డేట్​తో సుధీర్​బాబు - అడవి శేష్​ మేజర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో విజయ్​ దేవరకొండ, సుధీర్​ బాబు, నిఖిల్​, శ్రీవిష్ణు, అడవి శేష్​ సినిమా వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

devarkonda
దేవరకొండ

By

Published : Aug 12, 2021, 11:27 AM IST

కరోనాతో ఉద్యోగస్థులు 'వర్క్​ ఫ్రమ్​ హోం' చేయడం ప్రారంభించారు. ఇప్పుడు తాను కూడా ఇదే చేస్తున్నట్లు తెలిపాడు హీరో విజయ్​ దేవరకొండ. ఏంటి అర్థం కాలేదా? ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'లైగర్'​ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్​ చెప్పడం షురూ చేశాడు. అయితే దీనిని ఇంటినుంచే చెప్పుతున్నాడీ హీరో. దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్​ చేశాడు. 'యువర్​ బాయ్​ ఈజ్​ బ్యాక్​, వర్క్ ఫ్రమ్​ హోం' అని వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్​గా నటిస్తోంది.

విజయ్​ దేవరకొండ

దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్‌'(Sridevi Soda Centre). గురువారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది. ఆనంది కథానాయిక.

శ్రీదేవి సోడా సొంటర్​

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. తాజాగా ఈ చిత్రంలోని మాయ మాయ లిరికల్​ వీడియో సాంగ్​ రిలీజ్​ అయింది. మేఘ ఆకాష్‌ కథానాయిక. సునైన ముఖ్యభూమిక పోషించారు. హితేశ్‌ గోలి దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ నెల 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

26/11 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్‌'. యువ నటుడు అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. మొత్తం షూటింగ్​ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని తెలిపింది చిత్రబృందం. అడివిశేష్​కు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్​ చేసింది. త్వరలోనే అప్డేట్స్​ తెలియజేస్తామని వెల్లడించింది. సయీ మంజ్రేకర్‌, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు.

మేజర్​

ఇదీ చూడండి: ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం​.. కరీనా ఏమందంటే?

ABOUT THE AUTHOR

...view details