పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్'(Liger Movie Update). ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు పూరీ(Director Puri Jagannath Movies list). మరో రెండు నెలలు చిత్రీకరణ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. తన కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' చిత్రం(romantic movie release date) ప్రచారంలో భాగంగా 'లైగర్' విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. సినిమా విడుదలపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేనని పేర్కొన్నారు.
'మరో రెండు నెలల్లో 'లైగర్' చిత్రీకరణ పూర్తి' - విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్(Liger Update). పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా చిత్రీకరణపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు పూరీ. మరో రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.
లైగర్
ఆకాశ్ నటించిన 'రొమాంటిక్' సినిమా విషయంలో ప్రభాస్, విజయ్ దేవరకొండ ఎంతో సహకరించారని పూరీ అన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రసీమలోని అగ్ర దర్శకులంతా కలిసి తన కుమారుడి సినిమాను వీక్షించి ఆనందించడం ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకమని అన్నారు.
ఇదీ చదవండి:మా నాన్న గర్వపడేలా నటిస్తా: ఆకాశ్ పూరీ