తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హైదరాబాద్​కు విజయ్ దేవరకొండ 'లైగర్' - విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'లైగర్'. ఇప్పటివరకు ముంబయిలోనే షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.

Liger
లైగర్

By

Published : Apr 11, 2021, 7:25 AM IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న 'లైగర్‌' చిత్రీకరణ ఎక్కువగా ముంబయిలోనే జరుగుతోంది. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ఆండీ లాంగ్‌ నేతృత్వంలో ఇటీవల అక్కడ కొన్ని పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా అనన్యా పాండే కనిపించనుంది. విజయ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. ఆయన ఫైటర్‌గా, ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారు. ఈ చిత్రం కోసం ఆయన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందారు. కండలూ పెంచారు.

ABOUT THE AUTHOR

...view details