*విజయ్ దేవరకొండ 'లైగర్'(vijay devarakonda liger release date) టీమ్ తిరిగి సెట్లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చెబుతూ బాక్సింగ్ రింగ్‌లో విజయ్ కూర్చుని ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. పిలకతో సరికొత్తగా కనిపించారు విజయ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
*'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లోని(most eligible bachelor movie) 'లెహరాయి' లిరికల్ సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. అఖిల్-పూజా హెగ్డే(akhil and pooja hegde movie) హీరోహీరోయిన్లుగా నటించారు. భాస్కర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 8న థియేటర్లలో చిత్రం రిలీజ్ కానుంది.