*విజయ్ దేవరకొండ 'లైగర్'(liger movie release date) అమెరికాలో షెడ్యూల్ మొదలైంది. మైక్ టైనస్, విజయ్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయమే చెబుతూ రౌడీ హీరో(vijay devarakonda movies).. టైసన్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. "దిస్ మ్యాన్ ఈజ్ లవ్. ప్రతి క్షణాన్ని జ్ఞాపకాల్లా మార్చుకుంటాను. ఇదెప్పటికీ గుర్తుండిపోతుంది" అని క్యాప్షన్ జోడించారు.
అయితే ఇందులో మైక్ టైసన్(liger movie mike tyson) ఏ పాత్రలో కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్‌కు తండ్రి, కోచ్, ప్రత్యర్థిగా కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా(liger movie heroine) నటిస్తోంది. పూరీ జగన్నాథ్(puri jagannadh movies) దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తోంది.
*'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor ott) ఓటీటీ ట్రైలర్ విడుదలైంది. ఈ శుక్రవారం(నవంబరు 19) ఆహా ఓటీటీలో రిలీజ్ కానుందీ సినిమా. ఇందులో అఖిల్, పూజా హెగ్డే(pooja hegde movies) జంటగా నటించారు. పెళ్లి నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు.
అక్కినేని అఖిల్.. ఈ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో తొలిసారి చేరారు. ఈ చిత్రంలోని లెహరాయి(lehrayi song), గుచ్చే గులాబి, చిట్టి అడుగు పాటలు అయితే.. ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి.