LIGER Glimpse: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా.. నేడు 'లైగర్' గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'వి ఆర్ ఇండియన్స్' అంటూ విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ డైలాగ్‌తో అదరగొట్టాడు. ముంబయి స్లమ్ ప్రాంతంలోని 'ఛాయ్‌వాలా' నుంచి బాక్సర్‌గా విజయ్ ఎలా ఎదిగాడనే స్టోరీతో గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా అనన్యా పాండే నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదీ చదవండి: