తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సింగ్ మధ్యలో విజయ్ గుర్రపు స్వారీ.. అనన్యతో కలిసి - లైగర్​ సినిమా

'లైగర్'​(vijay devarakonda new movie liger) సినిమా షూటింగ్​లో కాస్త విరామం దొరకడం వల్ల హీరో విజయ్​ దేవరకొండ, అనన్య పాండే కలిసి సరదాగా గడిపారు. ఇద్దరూ కలిసి గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్​ చేశారు(vijaydevarkonda ananya pandey horse ride). దీనికి సంబంధించిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

liger
లైగర్​

By

Published : Nov 21, 2021, 4:58 PM IST

పూరీజగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న భారీ ఎంటర్​టైనర్​ సినిమా 'లైగర్'​(liger movie shooting). ఈ మూవీలో దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు(liger film mike tyson). ​లాస్​వెగాస్​లో ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే షూటింగ్​ మధ్యలో కాస్త విరామ సమయం దొరకడం వల్ల సరదాగా గడిపారు విజయ్​, అనన్య పాండే. వీరిద్దరూ కలిసి గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్​ చేశారు(vijaydevarkonda ananya pandey horse ride). దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది అనన్య. 'హౌడీరౌడీ' అని క్యాప్షన్​ జోడించింది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. ఇటీవలే మైక్​టైసన్​తో విజయ్​, అనన్య, పూరీ జగన్నాథ్​, ఛార్మి కలిసి దిగిన ఫొటోలను చిత్రబృందం పోస్ట్​ చేయగా.. అవి కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

విజయ్​ దేవరకొండ, అనన్య పాండే గుర్రపు స్వారీ

పా​న్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

అనన్య పాండే గుర్రపు స్వారీ
అనన్య పాండే గుర్రపు స్వారీ

ఇదీ చూడండి: 'లైగర్' బాయ్స్ చిల్.. 'సత్యమేవ జయతే 2' ట్రైలర్

ABOUT THE AUTHOR

...view details