తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లండన్ ఇండియన్​ ఫిల్మ్​ పెస్టివల్​లో ఆర్టికల్ 15 చిత్రం! - khurana

జూన్​ 20 నుంచి జరిగే లండన్ ఇండియన్ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఆయుష్మాన్​ ఖురానా నటించిన ఆర్టికల్ 15 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. జులై 8 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

ఆయుష్మాన్

By

Published : May 12, 2019, 9:07 PM IST

లండన్​ ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో(ఎల్​ఐఎఫ్ఎఫ్​) బాలీవుడ్​ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆర్టికల్​ 15 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. జూన్​ 20న లండన్​లో జరిగే 10వ వార్షికోత్సవంలో ప్రదర్శించేందుకు 25 సినిమాలను ఎంపిక చేశారు. ఇందులో 11 దక్షిణాసియా దేశాల చిత్రాలు, 6 యూకే సినిమాలున్నాయి.

భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం ఆధారంగా ఆర్టికల్ 15 సినిమాను తీస్తున్నారు. "కులం, మతం, వర్ణం, లింగాల ఆధారంగా ఏ మనిషిపై వివక్ష చూపించరాదు" అనేది రాజ్యాంగంలోని 15వ అధికరణ సారాంశం. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు.

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూకే, యూఎస్, పోలాండ్ దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. యూకేలో జరిగే ఈ కార్యక్రమాన్ని 23 వేదికల్లో ఐదు పట్టణాల్లో నిర్వహించనున్నారు. జులై 8వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details