తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధేశ్యామ్'​లో ప్రభాస్ లుక్ అదిరిపోద్ది! - prabhas nag ashwin film

'రాధేశ్యామ్' దర్శకుడు రాధాకృష్ణ.. ట్విట్టర్​లో అభిమానులతో ముచ్చటించారు. ప్రభాస్ లుక్ సినిమాకు అతి పెద్ద బలమని అన్నారు.

'రాధేశ్యామ్'​లో ప్రభాస్ లుక్ అదిరిపోద్ది!
ప్రభాస్ రాధేశ్యామ్

By

Published : Sep 7, 2020, 7:30 AM IST

ప్రభాస్‌ లుక్కే 'రాధేశ్యామ్‌' సినిమాకు అతి పెద్ద బలమని అంటున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా ఆయన తీస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ వారంలోనే చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు దర్శకుడు ట్విటర్‌ ద్వారా సమాధానమిచ్చారు.

"ప్రభాస్‌తో సినిమా చేయడం నా కల. ఆయనతో పనిచేస్తుండడం ఎంతో సంతృప్తినిస్తోంది. ప్రభాస్‌ కనిపించే విధానం సినిమాకు ప్రధాన బలం. వచ్చే ఏడాది చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయికగా మా తొలి ఎంపిక పూజాహెగ్డేనే. సరైన సమయంలోనే, అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తాం. ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోద్ది" - దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్‌

రాధేశ్యామ్ ఫస్ట్​లుక్​లో ప్రభాస్-పూజా హెగ్డే

ABOUT THE AUTHOR

...view details